19 August, 2026 | 1:08 AM

పబ్లిక్‌స్కూల్ కోసం విద్యార్థుల ర్యాలీ

19-08-2026 12:17 AM

వెల్దుర్తి, ఆగస్టు 18 (విజయక్రాంతి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ  రోజురోజుకు ఉద్యమం తీవ్రమౌతుంది. ప్రభుత్వం మండల కేం ద్రానికి మధ్యలో పబ్లిక్ స్కూల్ ఇతర  ప్రాం తానికి నిర్మించవద్దని గ్రామస్తులు, యువత గత కొద్ది రోజులుగా ఉద్యమం తీవ్రతరం చేశారు. మంగళవారం విద్యాసంస్థలు, వ్యాపారవేత్తలు వ్యాపార సముదాయాలను  స్వచ్ఛందంగా మూసి నిరసన వ్యక్తం చేపట్టారు. విద్యార్థులతో కలిసి గ్రామస్తులంతా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.