06-08-2024 04:14:15 PM
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిణామాలపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు జులైలోనే స్వదేశానికి వచ్చేశారని జైశంకర్ అన్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న భారతదేశ వ్యవస్థలను అక్కడి ప్రభుత్వం కాపాడుతుందని ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు. బంగ్లాలోని మైనారిటీలు, వారి వ్యాపారాలపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి తెలిపారు. బంగ్లాదేశ్ సైన్యంతో ఎప్పటికప్పుడు భారతదేశం మాట్లాడుతూనే ఉందన్నారు. బంగ్లాదేశ్ తో భారత్ కు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని రాజ్యసభలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రకటన తర్వాత లోక్ సభలో కూడా చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.