calender_icon.png 10 October, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల డ్రామాలు

10-10-2025 01:51:47 AM

చట్టబద్ధంగా పెంచిన బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం బీసీ వ్యతిరేక చర్య. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కింది నుంచి పైకోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారు. కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదు.

బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ర్టంలో ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి బీసీలు తమ నిరసనను వ్యక్తం చేయాలి. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని గవర్నర్ ఆమోదించి ఉంటే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై స్టే వచ్చేది కాదు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి దక్కడానికి మొదటి నుండి బీసీ సమాజమంతా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరుతుంది. బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తే గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకునే వారు.

బీజేపీ అదేమి చేయకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అనడం సిగ్గుచేటు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయి. ఒక పార్టీపై ఇంకొక పార్టీ నెట్టు వేసుకుంటూ బీసీలను బలి పశువులు చేశాయి. శుక్రవారం హైదరాబాదులో బీసీ సంఘాలు, కుల సంఘాలు మేధావులు, అఖిలపక్ష రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం.                     

 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్