10-10-2025 01:52:53 AM
నాలుగు వారాలు ఎన్నికలు వాయిదా వేస్తూ కోర్టు స్టే ఇవ్వడం అన్యాయమని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. గురువారం హైకోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టే ఇవ్వడం బీసీల నోటి కాడ అన్నం ముద్దను లాక్కోవడమే. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్లే ఈ అన్యాయం జరిగింది. న్యాయపరమైన చిక్కులను సరిగ్గా అంచనా వేయకపోవడంతోనే బీసీలకు ఈ గతి పట్టింది.
బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు, వారి హక్కుల విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం వహించడం తగదు. బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తదుపరి చర్యలు ప్రకటించాలి.
ప్రభుత్వం తక్షణమే స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తాం. రిజర్వేషన్ల కేసులో 30 బీసీ సంఘాలు ఇంప్లీడ్ కేసులు వేశారు. పిటిషనర్ల వాదన కూడా వినకుండా స్టే ఎలా ఇస్తారు. దీనికి భారీ మూల్యం చెల్లిస్తారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా కలిసి రావాలి.
బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య