calender_icon.png 24 November, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీలు సహకరించాలి

11-02-2025 12:00:00 AM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  భద్రాచలం సారపాక గ్రామపంచాయతీల లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఆమోదం, అభ్యంతరాల స్వీకరణ పై జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అధ్యక్షతన సోమవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ రాష్ర్ట ఎన్నికల సంఘం జనవరి 30వ తేదీన విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం భద్రాచలం, సారపాక గ్రామపంచాయతీలో పోలింగ్ కేంద్రాల  గుర్తింపు , ఆమోదం , అభ్యంతరాల స్వీకరణ ఫిబ్రవరి 9 నుండి13వ తేదీ వరకు పూర్తి చేయుటలో రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు.

ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. భద్రాచలం గ్రామపంచాయతీలో 41 వేల ఎనిమిది మంది ఓటర్లు కు గాను 60 పోలింగ్ కేంద్రాలు ,సారపాక గ్రామపంచాయతీ పరిధిలో 19,045 మంది ఓటర్ల కు గాను 36 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు . 

11 వ తేదీ న మండల స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రాల గుర్తింపులో అభ్యంతరాలు, ఓటర్లకు దూరంగా  ఉన్నట్లయితే లిఖిత పూర్వకంగా స్థానిక ఎంపీడీవోలకు అందజేయాలన్నారు.

12 న అభ్యంతరాల పరిశీలన, ఫిబ్రవరి 14వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని ఆమె అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, నేషనల్ కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ మరియు సిపిఎం రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.