calender_icon.png 24 November, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్షన్ కోడ్ లో పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై

10-02-2025 10:36:43 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎస్సై పాల్గొనడం చర్చనీయాంశమైంది. బేల మండలం దైగావ్ లో కాంగ్రెస్ పార్టీ సోమవారం చేపట్టిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో బేల ఎస్సై దివ్యభారతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పార్టీ ఖండవాలు వేసుకున్న కాంగ్రెస్ నేతలతో కలిసి ఎస్సై పోటీలను ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. కాగా ఈ విషయమై డీఎస్పీ జీవన్ రెడ్డిని వివరణ కోరగా ఎస్సై కార్యక్రమంలో పాల్గొన్న విషయం ఇంకా తన దృష్టికి రాలేదన్నారు. కోడ్ కొనసాగుతున్న తరుణంలో కార్యక్రమాల్లో పాల్గొనకూడదని అన్నారు.