calender_icon.png 19 December, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెకు పాకిన రాజకీయ కాలుష్యం!

11-12-2025 12:00:00 AM

డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి :

ఎన్నికల హింస, గొడవలు, ఆగ్రహావేశాలు చూస్తూ పెరుగుతున్న పిల్లలు భయంతో, అయోమయంతో, అసురక్షిత భావనతో ఎదుగుతున్నారు. ఇలాంటి పిల్లల్లో బూతులు మాట్లాడే అలవాటు, కొట్టుకోవడం, అబద్ధాలు చెప్పడం, ద్వేష భావజాలాలు త్వరగా పెరుగుతున్నాయి. భవిష్యత్తు తరానికి చెందిన  పిల్లలు సమాజంలో అసహన పౌరులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. 

ఒకప్పుడు పల్లె సీమలు ప్రశాంతతకు, పరస్పర ప్రేమాభిమానాల కు ప్రతీకగా ఉండేవి. కానీ నేడు అదే పల్లెల్లోకి రాజకీయ కాలుష్యపు గాలులు ప్రవే శించాయి. పంచాయతీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి పునాది కావాల్సిన సమయం లో.. కుటుంబాలను, బంధాలను చీల్చే విభజన సంస్కృతి పెరిగిపోతున్నది. ఈ పరిస్థితి నేడు ప్రతి గ్రామంలో సామాజిక సమస్యగా మాత్రమే కాదు మానసిక ఆరో గ్య సమస్యగానూ మారిపోయింది. ప్రస్తు తం పల్లెల్లో ఇంటికో పంచాయతీ మొదలైంది.

అన్నదమ్ములు వేర్వేరు రాజకీయ కండువాలతో పోటీలో నిలబడుతున్నారు. మామా అల్లుడు వేర్వేరు రంగు జెండాలు పట్టుకొని ప్రచారంలో పాల్గొంటున్నారు. సొంత అక్క చెల్లెళ్లు వేర్వేరు రాజకీయ పార్టీలను ఏంచుకొని బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, బంధుత్వాలు కనిపిస్తాయి.

కానీ ఫలితాల తర్వాత మాత్రం అవే బంధాలు, అభిమానాలు మిగులుతాయా? లేక చెదిరిపోతాయా అంటే చెప్పలేని స్థితి. ఈ అంశం ఇవాళ గ్రామ ప్రజల గుండెల్లో అతిపెద్ద ప్రశ్నగా నిలిచిపోయిందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితి వల్ల ఇళ్లలో నిత్య కలహాలు, అనుమానాలు, కోపావేశాలు, మాటల యుద్ధాలు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య భద్రత, విశ్వాసం తగ్గిపోతుండడం వల్ల మానసిక సంక్షోభానికి దారి తీస్తోంది.

వైరస్‌లా రాజకీయ పోటీ..

ఎన్నికల హింస, గొడవలు, ఆగ్రహావేశాలు చూస్తూ పెరుగుతున్న పిల్లలు భ యంతో, అయోమయంతో, అసురక్షిత భావనతో ఎదుగుతున్నారు. ఇలాంటి పిల్ల ల్లో బూతులు మాట్లాడే అలవాటు, కొట్టుకోవడం, అబద్ధాలు చెప్పడం, ద్వేష భావ జాలాలు త్వరగా పెరుగుతున్నాయి. భవిష్యత్తు తరానికి చెందిన ఈ పిల్లలు సమా జంలో అసహనశీలతతో కూడిన పౌరులు గా తయారయ్యే ప్రమాదం ఉంది.

గ్రామ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంటే, ఈ రోజు ప్రవర్తనే రేపటి సమాజాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం రాజకీయ పోటీ ఒక వైరస్‌లా మానవ సంబంధాల మధ్య చొరబడి బం ధాలను మట్టుబెడుతోంది. గెలిచినవారైనా, ఓడిపోయిన వారైనా సరే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ ఇద్దరూ అదే ఊర్లో తిరగాల్సి ఉంటుంది. 

అదే ఊరులోని బావిలో ఉన్న నీళ్లే తాగాలి, అదే పొలంలో పంటలు పండించాలి, అదే దేవాలయంలో పక్కపక్కనే నిల బడి మంగళహారతి అందుకోవాలి. కానీ మనసుల్లో మాత్రం ద్వేషం, అసూయ, అ వమానం, ప్రతీకారం అనే భావనలు నా టుకుపోతున్నాయి. ఇవి క్రమ క్రమంగా ఒ త్తిడి, ఆందోళన, నిద్రలే మి, కోప నియంత్రణ లోపం వంటి మానసిక సమస్యలను పెంచుతున్నాయి. అయితే ఈ చిన్న పంచాయతీ పదవుల కోసం మనుషులు తమ ఆత్మీయుల ప్రేమాభిమానాలను కోల్పోవడం బాధాకరమని చెప్పొచ్చు.

పదవులు తాత్కాలికం..

గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ప్ర స్తుతం కేవలం రాజకీయ ఉద్రిక్తత మాత్ర మే కాదు సామూహిక మానసిక ఒత్తిడిగా తయారవుతోంది. ఎవరు ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకునే వరకు అనుమానం, భయం, కోపం, అపనమ్మకం అనే భావా లు మనుషుల మనసు పొరల్లో పెరిగిపోతున్నాయి. ఇవి క్రమంగా రక్తపోటు, నిద్ర లేమి, ఆందోళన, రుగ్మతలు, కోప నియంత్రణ లోపం వంటి సమస్యలకు దారి తీస్తు న్నది. పదవి ఉండేది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. కానీ మనిషి జీవితం తో వచ్చే బంధం మాత్రం నూరేళ్లు ఉం టుంది.

వారి బంధం అమూల్యం. ఆ జ్ఞాపకాలు శాశ్వతం. రాజకీయాల వల్ల చీలిపో యే గ్రామం ఎన్నటికీ అభివృద్ధి చెందదు. అది ఓడిపోయిన అభ్యుదయం. అది గెలిచిన ద్వేషం. పంచాయతీ ఎన్నికలు పోటీ దారుల మధ్య ఉండాలి. కానీ ఎన్నికలనేవి ఎప్పుడూ మనుషుల మధ్య యుద్ధంగా మారకూడదు. మనసులు చీలిన చోట అభివృద్ధి వచ్చినా, ఆనందం, సంతోషం మాత్రం పుట్టదు.

రంగులు, వర్గాలు, మతా లు, గుంపుల పేరుతో విభజించే నాయకులకంటే, మన ప్రేమాభిమానాలను రాజకీ య పదవుల కోసం పణంగా పెట్టే మనమే పెద్ద తప్పు చేస్తున్నాం. నాయకుడు ఓటు కోసం వస్తాడు. కానీ మన మనసు విరగడానికి కారణం చాలా సార్లు మన అతి ఆత్మాభిమానం, అహంకారం, పట్టుదలే కారణాలవుతున్నాయి. పదవి వస్తుంది, పోతుంది కానీ బంధాలు తెగిపోతే ఎన్నటికీ తిరిగి రావు. బంధాల బాధ జీవితాంతం మనసును బాధిస్తూ ఉం టుంది.

పంచాయతీలు గెలవాలి కానీ పల్లెగుండెలు చీల్చకూడదు. రాజకీయాలు రావాలి కానీ మనిషి బంధం పోకూడదు. ఎన్నికలు ముగిశాక కూడా గ్రామంలో మాట్లాడుకునే మనుషులు ఉండాలి, పలకరించే హృదయాలు ఉండాలి. గ్రామ స్థులంతా కలిసి పండుగలు చేసుకునే బంధాల మధ్యనే నిలబడి ఉండాలి. అప్పు డే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అదే నిజమైన విజయం. అదే అసలు సిసలు పంచాయతీ అన్నది గ్రహించాలి.

బంధాలకు అతీతంగా..

భర్తల రాజకీయ గొడవల వల్ల ఇంట్లో భద్రత లేకుండా పోతోంది. మానసిక హిం స, మాటల దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల సమయంలో గ్రామ మహిళలు భయంతో, మౌనంగా, ఒత్తిడితో బతుకుతున్నారు. కానీ చాలా సార్లు ఈ మానసిక బాధ బయటికి చెప్పుకునే అవకాశమే ఉండదు. పదవులను మనిషి అలంకరిస్తాడు కానీ బంధాలే మనిషికి నిజమైన ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తాయి.

బంధాలు బలంగా ఉంటేనే మనిషి విపత్తుల్ని తట్టుకునే శక్తిని పొందగలుగుతాడు. బంధాలు బలహీనమైతే అదే మని షి ఒంటరితనం, ఒత్తిడి, నైరాశ్యంలోకి జారిపోయే ప్రమాదముంది. అందుకే పదవుల కోసం బంధాలను బలి చేసుకోవద్దు. గెలు పు సంతోషాన్ని ఇవ్వాలి కాని మనుషుల మధ్య విషాదాన్ని మిగిల్చకూడదు. విద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు.

విడి విడిగా పోటీ పడాలి.. ఫలితాల అనంతరం ఎవరు గెలిచినా సరే బంధాలకు అతీతంగా అందరిని కలుపుకుపోవాలి. అదే గ్రామానికి నిజమైన మానసిక ఆరోగ్యం. ఎన్నికలు తాత్కా లికం, కానీ మానసిక గాయాలు శాశ్వతం. ఎన్నికల్లో  గెలిస్తే పదవి రావచ్చు కానీ బంధాలు పోతే జీవితాంతం పశ్చాత్తాపమే మిగులుతుందన్నది అక్షర సత్యం.

 వ్యాసకర్త సెల్: 9703935321