19-12-2025 07:15:03 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని శ్రీకృష్ణ నర్సింగ్ హోమ్ 50వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, నర్సింగ్ హోమ్ వారి సేవలు వృద్ధులు, రోగులకు అందించే వైద్య సౌకర్యాలలో ప్రేరణగా ఉన్నాయని, 50 ఏళ్ల నిబద్ధత, కృషి, సేవలను ఆయన అభినందించారు.