19-12-2025 07:25:12 PM
కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శుక్రవారం రాహుకాల పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆరున్నర గంటలకు విజయ దుర్గా మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం సంతాన మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం జరిగింది.
ఉదయం పది గంటలకు క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో మహా సంకల్పం అనంతరం నవగ్రహ, దిక్పాలక స్థాపన స్థాపిత దేవతా పూజ అష్టనాగదేవతా పూజ, అభిషేకం నిర్వహించారు. తర్వాత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు. తర్వాత భక్తుల జయజయ ధ్వానాల మధ్య పల్లకీసేవనేతైరపర్వంగా సాగింది. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.