calender_icon.png 19 December, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల సమస్యలు వచ్చినపుడు సమయస్ఫూర్తిగా వ్యవహారించాలి

19-12-2025 07:20:42 PM

జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య

తుంగతుర్తి,(విజయ క్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖలోని, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 'బేటీ బచావో - బేటీ పడావో' పథకంలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల లో శుక్రవారం బాలికా చైతన్యo అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ.. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. సమాజంలో బాలికల పట్ల ఉన్న వివక్షను రూపుమాపడమే 'బేటీ బచావో - బేటీ పడావో' ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

​సందేశంలోని ముఖ్యాంశాలు: ​విద్యే ఆయుధం: ప్రతి బాలిక ఉన్నత చదువులు చదివి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఆర్థిక స్వాలంబన సాధించినప్పుడే మహిళలకు గౌరవం లభిస్తుంది. 

​చట్టాలపై అవగాహన: బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టం, మరియు మహిళా రక్షణ చట్టాల పట్ల ప్రతి విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలి. 

ప్రభుత్వ ప్రోత్సాహం: ప్రభుత్వం బాలికల విద్య కోసం అందిస్తున్న రాయితీలు, వసతులను సద్వినియోగం చేసుకోవాలి. 

ఆరోగ్యం మరియు పరిశుభ్రత: చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ వహించాలని విద్యార్థినులకు సూచించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ వో కల్పన, మహిళా శిశు సంక్షేమ శాఖ జెండర్ స్పెషలిస్ట్ వినోద్, భవ్య మరియు తదితరులు పాల్గొన్నారు.