calender_icon.png 19 December, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్

11-12-2025 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లాంటి శిఖరాగ్ర సమావేశాలు, ప్రాంతీయ పెట్టుబడులు, నిర్దిష్ట రంగ అభివృద్ధి పేరిట వివిధ రంగాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేయబడుతుందని అంచనా వేసింది.

తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్-2047 ఆవిష్కరణ దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా పేర్కొనవచ్చు. గ్లోబల్ సమ్మిట్ సదస్సులో వెల్లువె త్తిన పెట్టుబడులతో ఆధునిక, శాస్త్ర సాంకేతిక రంగాభివృద్దితో లక్షల ఉద్యోగాల కల్ప నకు ఫ్యూచర్ సిటీ పునాది వేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ప్రపంచ దేశాలను అబ్బురపరిచాయి. తెలంగాణ రైజింగ్ విజన్ రాష్ర్టంలో అభివృద్ధి అనేది అన్‌స్టాపబుల్ అనే దానికి సంకేత మిచ్చింది.

తెలంగాణలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ దేశంలో ఒక సమున్నతమైన స్థానం సంపాదించుకుంది. దేశంలో 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో భావితరాల భవిష్యనిధికి ఆర్థిక, సమతుల్యం, సుస్థిరాభివృద్ది దిశగా అడుగులు వేయడం శుభ సూచకం. అంతేకాదు ఈ సదస్సు రాష్ర్ట హెరిటేజ్, సంస్కృతికి పెద్దపీట వేసింది. ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలనే ఆకాంక్షతో పాటు వివిధ రంగాల్లో జరగాల్సిన అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణా లు మెరుగుదల కోసం పేదరికం లేని రాష్ర్టంగా.. అందరికి విద్యను అందించే లాగా తయారు చేసిన విజన్-2047 డాక్యుమెంట్ ప్రపంచ దేశాల ప్రతినిధుల సవ్వడిలో నిరాడంబరంగా ఆవిష్కరించా రు.

తెలంగాణ అభివృద్ధి నమూనాలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే రోజులు దగ్గరపడ్డాయని అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేయడం గొప్ప విషయంగా పేర్కొనవచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో వర్చువల్ గా పాల్గొన్న  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎండీ జెరేమీ జుర్గెన్స్.. తెలంగాణతో భాగస్వా మ్యం అయ్యేందుకు  2026 జనవరి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఎం రేవంత్ రాక కోసం ఎదురుచూస్తుందని పేర్కొన్నారు.

భారీగా పెట్టుబడులు..

ప్రజల భాగస్వామ్యంతో, ప్రజలతో మ మేకమై రూపొందించిన తెలంగాణ రైజిం గ్ విజన్ డాక్యుమెంట్ వాస్తవ రూపం దాల్చితే తెలంగాణ మోడల్ ప్రపంచ దేశా లు కూడా అనుసరించే పరిస్థితి దగ్గర్లోనే ఉన్నదని యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయిర్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రభు త్వం చేస్తున్న కృషికి నిలువుటద్దంగా చెప్పవచ్చు. తెలంగాణలో పెట్టుబడులకు దేశ, విదేశాల నుంచి ప్రాధాన్యత గల కంపెనీ లు పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. విజన్ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో, ఇంధనం, ఔషధాలు తయారీ వంటి వివి ధ రంగాలలో సుమారు రూ.5.75 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఎంఓయూ చేసుకోవడం విపక్షాలను సైతం గాబరా పడేలా చేసింది. రెండు దశాబ్దాలుగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ..  వైబ్రంట్ గుజరా త్ సమ్మిట్‌లో గణనీయమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతులయ్యారు.

ఎందుకంటే భారతదేశ చరి త్రలో ఎగుమతుల్లో గణనీయమైన భాగా న్ని కలిగి ఉంది. పెరుగుతున్న  కాలుష్యం వల్ల ఎన్సీఆర్, ఢిల్లీ నుంచి అలాగే  బెంగుళూరు ట్రాఫిక్  సమస్యల వల్ల పరిశ్రమలు హైదరాబాద్‌కు చేరువయ్యే  అవకాశం ఉందని సదస్సుకు హాజరైన వక్తలు పేర్కొన్నారు. ఇప్పుడైతే కర్ణాటకను మించి హైద రాబాద్ దూసుకెళ్లడం, ప్రత్యేకంగా ఇంధ నం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడి యా, విద్య , టెక్నాలజీ వంటి రంగాల్లో భా రీగా పెట్టుబడులు రావడం ముదావహం. వైద్య సేవలను వినియోగించుకునేందుకు క్లినికల్ రీసెర్చ్, జీనోమిక్స్, టెలి హెల్త్ , ఫా ర్మసీ, లాజిస్టిక్ బలోపేతంతో పాటు అంతర్జాతీయ హెల్త్ కేర్ టాలెంట్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సదస్సు నిర్వహించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఉపాధి అవకాశాలు..

పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ గ్లోబల్ సమ్మిట్-2025 రెం డు రోజుల పాటు సమర్థవంతంగా నిర్వహించారు. రేవంత్ ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్, బీఆర్‌ఎస్ పాలన గురించి, వాళ్లు చేసిన తప్పిదాల గురించి ప్రతీ వేదికపై దు య్యబట్టేవారు. కానీ ఈసారి తన పంథా ను మార్చుకున్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులకు కేసీఆర్‌ను పరిచయం చేయడం అవసరమా? అని బావించారేమో కానీ రెండు రోజుల సదస్సులో ఆయన పేరును ఎక్కడ ప్రస్తావించకుండా గొప్ప రాజకీయ చతురతను ప్రదర్శించారు.

గ్లోబల్ సమ్మి ట్-2025 రాష్ర్టంలో 2034నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అసాధ్యం అన్న విపక్షాలకు గ్లోబల్ సమ్మిట్ సుసాధ్యమే అని తెల్చి చెప్పింది. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజాలు మొదటిరోజు 2.43 లక్షల కోట్లతో, రెండవ రోజు 3.32 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

ఇందులో సగం హరిత ఇంధనానికి సంబంధించినదే కావడం గమనార్హం. గ్రీన్ ఎనర్జీలో దాదా పు 3 లక్షల కోట్ల ఎంఓయూ కుదిరింది. సినీరంగాభివృద్దికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానితో ప్రపంచ దేశాలకు చెందిన వారు హైదరాబాద్‌కు వచ్చి షూటింగ్ చేసుకునేందుకు వీలుగా ‘ఫిల్మ్ హబ్’ను తీర్చిదిద్దే ప్రయత్నం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ హబ్ పేరిట లక్షలాది మంది యువతకు ఉపాధికి దారి చూపిన బాటసారిగా తెలంగాణ మట్టిని ఎన్నటికీ మరువకుండా చేస్తుంది.

విలువైన ఒప్పందాలు..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మి ట్-2025 లాంటి శిఖరాగ్ర సమావేశాలు, ప్రాంతీయ పెట్టుబడులు, నిర్దిష్ట రంగ అభివృద్ధి (ఐటి, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు సహా) పేరిట వివిధ రంగాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకం చేయబడుతుందని అంచనా వేసింది. దేశ జనాభా అయిన 142 కోట్ల మందిలో తెలంగాణ జనాభా 2.9శాతమే ఉన్నప్పటికీ రాష్ట్ర జీడీపీ మాత్రం 5 శాతానికి చేరింది.

భవిష్యత్తులో సింగపూర్, చైనా, జపాన్, జర్మనీ లాంటి దేశాలను రోల్ మోడల్‌గా తీసుకోని 10 శాతం వాటాకు చేరే విధంగా లక్ష్యంగా పెట్టుకోవడం రేవంత్‌కు ప్రభుత్వానికి సానుకూ లంగా పేర్కొనవచ్చు.సాధారణంగా పాలకులు అంకెల గారడీకి, జీడీపీ లెక్కలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ రేవంత్ ప్రభుత్వం ఆలోచనలు అందుకు బిన్నంగా ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ విజ న్-2047 డాక్యుమెంట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆయా రంగాల నిపుణలతో నిర్మించిన ఎవరెస్టు శిఖిరం.

ముందు చూపుతో ఫోర్త్ సిటీ ఏర్పాటు పారిశ్రామిక వేత్తలను ఉసికొల్పింది. నాడు గాంధీ, నెహ్రూల స్పూర్తితో నిరుపేదలకు మేలు చేసేలా తెచ్చిన డాక్యుమెంట్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అభివృద్ధి ప్రామాణికంగా మూడు అంశాలు.. ‘క్యూ ర్, ప్యూర్, రేర్’లను విభిన్న జోన్లుగా విభజించిన రాష్ర్టంగా తెలంగాణ నిలవనుం డటం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రజాపాలనకు ప్రతిబింబంగా నిలిచింది. 

రాబోయే రోజుల్లో  సీఎం రేవంత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందని ప్రజాపాలన వేదిక ద్వారా స్పష్టమయింది. భారత యువ మేధాశక్తిని నూతన ఆవిష్కరణల వైపు నడిపించాలనే సంకల్పం, ఆధునిక సాంకేతిక రంగాల్లో వస్తున్న వేగవంతమైన మార్పులను పసిగట్టి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన దిగ్గజాలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం శుభ పరి ణామం.  

 వ్యాసకర్త సెల్:- 9866255355