07-08-2025 01:07:47 AM
గోల్డెన్ ఓక్ చైర్మన్ గంట రవికుమార్
హన్మకొండ, ఆగస్టు 6 (విజయక్రాంతి): హనుమకొండ కాపువాడ లోని గోల్డెన్ ఓక్ పాఠశాలలో ఈరోజు ‘వార్షిక ఇన్వెస్టీచర్ వేడుకను‘ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నూతనంగా ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాయకత్వానికి నాంది పలకడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు నాయకత్వము, నాయకత్వ గుణాలు, క్రమశిక్షణ, సేవా దృక్పథం వంటి విలువల అవసరమని పేర్కొన్నారు.
నాయకత్వం అనేది హోదా కాదు అది ఒక బాధ్యత అని ఉద్బోధించారు. హెడ్ బాయ్, హెడ్ గరల్స్, స్పోరట్స్ హెడ్, కల్చలర్ హెడ్, అలాగే కెప్టెన్, వైస్ కెప్టెన్,వంటి బాధ్యులను ఎంపిక చేసి వారిచే ప్రమాణస్వీకారం చేపించి బాధ్యతలను నిబద్ధత తో నిర్వర్తించాలనేటువంటి ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపాల్ బాసాని దీప్తి మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతాయుతంగా నడుచుకుని తమ సహచరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివనగర్ పాఠశాల ప్రిన్సిపల్ మనోహర్ రావు, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.