calender_icon.png 7 February, 2026 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి

06-02-2026 09:21:47 PM

వరంగల్,(విజయక్రాంతి): పోలింగ్ నిర్వహణలో పారదర్శకత, సమర్థత ఎంతో కీలకమని, చిన్న పొరపాటు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. నర్సంపేట జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన పిఓ, ఏపీవో ల శిక్షణ కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. శిక్షణ అనంతరం నర్సంపేట మునిసిపల్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఎన్నికల సామగ్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు, సీల్స్, బ్యాలెట్ పేపర్లు, రిజిస్టర్లు తదితర సామగ్రి సరైన సంఖ్యలో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందించాలని, ప్రక్రియ నిబంధనల ప్రకారం, సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి పూర్తిస్థాయి అవగాహనతో పనిచేయాలని, ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న పీఎం శ్రీ జెడ్పి సెకండరీ స్కూల్ పరిసరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రాధానోపాధ్యులు తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమా, మునిసిపల్ కమిషనర్ భాస్కర్, తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి, ఎన్నికల అధికారులు, మునిసిపల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.