calender_icon.png 17 December, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెంట్ కిందే పోలింగ్ కేంద్రం..!

17-12-2025 04:00:40 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మహాదేవపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వినూత్నంగా కొనసాగుతున్నాయి. స్థానిక ప్రభుత్వ పాఠశాల భవనం ఇరుకుగా ఉండటంతో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పాఠశాల ఆవరణలో టెంట్ ఏర్పాటు చేసి ఆరుబయటే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల సిబ్బంది పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.