calender_icon.png 17 December, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి రైల్వే స్టేషన్ డివిజనల్ మేనేజర్ విజిట్

17-12-2025 03:57:24 PM

ఆటో స్టాండ్, మరుగుదొడ్ల కు వినతి

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ ఆర్ గోపాల కృష్ణ సందర్శించారు. బుధవారం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన ఆయనకు పదో వార్డులో పర్యటించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల కృష్ణ రైల్వే ఆటో డ్రైవర్లు తమ సమస్యలను విన్నవించారు.

బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో ఆటో స్టాండ్ ను ఏర్పాటు చేయాలని కోరారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్   ప్రయాణికుల సౌకర్యం కోసం ఆటో స్టాండ్ ను ఏర్పాటు  చేయాలని,స్టేషన్ బయటి ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించాలని వినతి పత్రం అందచేశారు. డి ఆర్ ఎం గోపాల కృష్ణ వినతి పత్రం అందజేసిన వారిలో 10 వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కొక్కర చంద్రశేఖర్, స్టేషన్ ఆటో డ్రైవర్లు ఉన్నారు.