17-12-2025 05:03:36 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని విజయ హై స్కూల్ లో చదివి ఇటీవల గ్రామ పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులకు పాఠశాల యాజమాన్యం బుధవారం సన్మానం చేసింది. సోను మండలంలోని వెలుమల గ్రామానికి చెందిన రాచకొండసాగర్ దిల్వార్పూర్ మండలంలోని మాయాపూర్ కు చెందిన సౌమ్య సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందడంతో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ హై స్కూల్ యాజమాన్యం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు అయ్యన్న గారి భూమయ్య ఆడెపు సుధాకర్ అంబారాణి మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.