17-12-2025 05:01:57 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాందేయవాది కీర్తిశేషులు పాలవరపు లక్ష్మీనరసయ్య సతీమణి పాలవరపు రాములమ్మ(96) గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాదులో బుధవారం ఆయన కుమారులు పాలవరపు సంఘమిత్ర, పోలవరపు ఆజాద్, పోలవరపు సంతోష్ ల నివాసంలో మృతిచెందింది. దీనితో తుంగతుర్తి మండలానికి చెందిన ఆర్యవైశ్య మహాసభ సంఘం జిల్లా నాయకులు బండారు దయాకర్, బండారు సత్యనారాయణ, ఓరిగంటి శ్రీనివాస్, ఓరుగంటి సూర్య ప్రకాష్ ఓరిగంట అశోక్, ఈగ నాగన్న, తల్లాడ కేదారి, ఈగ లక్ష్మయ్య దామెర కృష్ణమూర్తి, గుమ్మడవెల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పుల్లయ్య, పలువురు కుటుంబ సభ్యులు పాల్గొని, ఆమె పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు.