17-12-2025 04:04:24 PM
1 గంట వరకు 80.64 శాతం నమోదు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా నిర్వహిస్తున్న పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.00 గంటల వరకు సజావుగా కొనసాగినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అల్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. ఆమండలాల వారీగా ఒంటిగంట వరకు నమోదైన ఓటింగ్ శాతం ఈ విధంగా ఉందన్నారు.
అల్లపల్లి 66.88 శాతం, గుండాల 85.93 శాతం, జూలూరుపాడు 77.01 శాతం, లక్ష్మీదేవిపల్లి 82.28 శాతం, సుజాతనగర్ 85.75 శాతం, టేకులపల్లి 84.16 శాతం, ఇల్లందు 77.93 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. మొత్తం పోలింగ్ శాతం 80.64 నమోదు అయింది అని తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటల వరకు పోలింగ్ కేంద్రాల లోపల లేదా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ప్రతి ఓటరికి తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చివరి ఓటరు వరకు పోలింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు.
పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సీలింగ్ చేసి, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, పోలీస్ బందోబస్తు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.