calender_icon.png 4 October, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి బండి కొనివ్వలేదని మనస్థాపంతో పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య

04-10-2025 08:38:58 PM

నూతనకల్ (విజయక్రాంతి): తండ్రి బండి కొనివ్వలేదని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామానికి చెందిన పల్చ గణేశ్(17)అనే యువకుడు పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. దసరా పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన యువకుడు తన తండ్రి పల్స బిక్షంను బైకు కొనివ్వాలని అడగడంతో, తండ్రి తన దగ్గర డబ్బులు లేవని ఇప్పుడు బైక్ కోనివ్వడం కుదరదని చెప్పడంతో మనస్థాపానికి గురై చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి పల్స బిక్షం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.