04-10-2025 08:41:13 PM
హనుమకొండ,(విజయక్రాంతి): బీఆర్ఎస్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వరంగల్ మహానగరంలోని కాజీపేట, భవాని నగర్, విశ్వవిద్యాలయ నగర్, హసన్ పర్తి నగర్, హనుమకొండ నగర్, కాశీబుగ్గ నగర్, ఖిలానగర్, వరంగల్ నగరాలలో ఆదివారం ఉదయం రూట్ మార్చ్ (పద సంచలన్) నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ మహానగర సంఘ చాలకులు డాక్టర్ బందెల మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పద సంచలన్ లో వేలాది మంది స్వయం సేవకులు పూర్తి గణవేశ(యూనిఫాం)తో పాల్గొంటారు.
ఈ రూట్ మార్చ్ లో ముందు వాహనంపై భరతమాత, డాక్టర్ జీ, గురూజీ చిత్రపటాలతోపాటు భగవద్ ధ్వజం అలంకరింపబడి ఉంటుంది. మధ్యలో ఘోష్ వాదకులు ఆనక్ ,వంశీ(వేణువు), పణవ, త్రిభుజి , జల్లరి, శంఖ, శృంగ వాయిద్యాలు వాయిస్తూ రూట్ మార్చ్ లో ఉంటారు. ఈ రూట్ మార్చ్ కు ఘోష్ ప్రముకుడు నేతృత్వం వహిస్తారు. ఆ వెనక స్వయం సేవకులు రూట్ మార్చ్ చేస్తూ గీతాలాపన చేస్తూ అనుసరిస్తారు. హిందూ సమాజంలో జాగృతిని కలిగిస్తూ స్ఫూర్తిని నింపడానికి శతజయంతి సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ దేశవ్యాప్తంగా ఈ రూట్ మార్చ్ లను నిర్వహిస్తుందని తెలిపారు.