calender_icon.png 28 July, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్‌చెరువు - ఆదిలాబాద్ రైల్వే పనులకు మోక్షం

28-07-2025 12:00:00 AM

  1. కామారెడ్డి జిల్లా పిట్లం వద్ద మట్టి పరీక్షలు 

కామారెడ్డి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్న మరో రైల్వేలైన్ 

కామారెడ్డి, జూలై 27 (విజయక్రాంతి) ః పటాన్‌చెరు  -అదిలాబాద్ రైల్వే లైన్ పనులు ఎన్నో ఏళ్లకు ఎట్టకేలకు ప్రారంభమై నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేయడంతో హైదరాబాదులోని పటాన్చెరు నుంచి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల మీదుగా  ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ పనులు ప్రారంభానికి ముందు రైల్వేలైన్ ఏర్పాటు చేయ నున్న స్థలాల్లో మట్టి పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఆదివారం కామారెడ్డి జిల్లా పిట్లం వద్ద మట్టి పరీక్షల్లో నిర్వహించడంతో రైల్వే లైన్ పనులు షురూ  అయినట్లు స్థానికులు చెప్తున్నారు. పటాన్చెరువు నుంచి 161 వ జాతీయ రహదారి ఉన్నట్లుగానే రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా కామారెడ్డి మీదుగా నిజాంబాద్ నాందేడ్,  ముంబై వరకు రైల్వే లైన్ ఉండడంతో పాటు రైలు ప్రయాణం ప్రస్తు తం ప్రజలకు అందుబాటులో ఉంది.

కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లా రెడ్డి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో రైల్వేలైన్ లేకపోవడంతో రైలు ప్రయా ణం చేయాలంటే కామారెడ్డికి రావాల్సిందే, లేకుంటే నిజాంబాద్ వెళ్లి అక్కడ నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం కొత్త రైల్వే లైన్ పనులు పూర్తయితే కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సు వాడ, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో రైల్వే లైన్లు నిర్మాణం చేపట్ట నున్నారు.

పటాన్ చెరువు -అదిలాబాద్ వరకు రైల్వే పనులు జరగనుండడంతో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు రైల్వే ప్రయాణం అందు బాటులోకి రానుంది. ప్రస్తుతం మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే  లైన్ మంజూరు కోసం అప్పటి జహీరాబాద్ ఎంపీ బి బి పాటిల్ పార్లమెంట్ సమావేశాల్లో కృషి చేశారు.

పార్లమెంట్ సమావే శాలలో పటాన్చెరు ఆదిలాబాద్ రైల్వే లైన్ మంజూరు చేస్తే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు రైల్వే ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ఎన్నో ఏళ్ల కల ఫలిస్తుందని పార్లమెంటు సమావేశాల్లో బిబి పాటిల్ సమస్య ను లేవనెత్తి  కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటు జరిగితే ఎంతో వెనుకబడిన ప్రాంతమైన జహీరాబాద్ నియోజకవర్గంలోని కామారెడ్డి, నిజా మాబాద్ జిల్లాలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

అత్యవసరంగా మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ రైల్వే లైన్ పనుల కు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేందుకు మట్టి సేకరణ పనులు ప్రారంభించారు. దీంతో కామారెడ్డి జిల్లా ప్రజలకు మరో రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల ప్రజలకు రైల్వే ప్రయాణం మరింత అందుబాటులోకి వస్తుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

రైల్వే పనులు ప్రారంభానికి ముందు రైలు పట్టాలు ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ, మట్టి పరీక్షలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ పటాన్చెరువు నుంచి అదిలాబాద్ వరకు నిధులు మంజూరు చేయడంతో కామారెడ్డి జిల్లాలోని ప్రజలకు మరో రైల్వే లైన్ తో పాటు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పనులు స్పీడుగా జరిగేలా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

గతంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా..

పటాన్చెరువు -ఆదిలాబాద్ రైల్వే లైన్ మంజూరు కోసం పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు కోసం కృషి చేశాను. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పనులు ప్రారంభించడం హర్షించదగ్గ విషయం. ఆనాడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వల్లే కొత్త రైల్వే లైన్ కోసం నిధులు మంజూరు అయ్యాయి.

ప్రధానమంత్రి మోడీకి, కేంద్ర రైల్వేమంత్రి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభమై పూర్తి అయితే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నియోజకవర్గంలోని జహీరాబాద్, కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, నియోజకవర్గ ప్రజలకు రైల్వే ప్రయాణం మరింత అందుబాటులోకి రానుంది.

బీబీ పాటిల్, పార్లమెంట్ మాజీ సభ్యుడు, జహీరాబాద్ రైల్వేలైన్ పనులు జరుగుతాయి..

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పటాన్చె రు, ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పా టు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను. పనులు త్వరలో చేస్తామని చెప్పారు. ఈ రైల్వే లైన్‌తో జహీరాబాద్  పార్లమెంటులోని ఐదు నియోజకవర్గాల ప్రజలకు రైల్వే ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. 

 సురేష్ షెట్కార్, పార్లమెంట్ సభ్యుడు, జహీరాబాద్