calender_icon.png 19 May, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ స్టేడియాన్ని సందర్శించిన పొంగులేటి మాధురి

19-05-2025 12:49:53 AM

-ఎంపీ నిధులతో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటుకు హామీ

కల్లూరు,మే18(విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి పొంగులేటి మాధురి ఆదివారం కల్లూరు మినీ స్టేడియాన్ని సందర్శించారు.

అనంతరం చిన్న పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు పసుపులేటి వీర రాఘవయ్య చిన్నపిల్లలకు సంబంధించిన చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని  ఆమె దృష్టికి తీసుకెళ్లగా స్పందించి  ఖమ్మం ఎంపీ రామసహయం రఘురామి రెడ్డి నిధుల నుండి రూ 10 లక్షలతో నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పిల్లలకు కావలసినటువంటి జారుడుబల్లలు, స్ప్రింగ్ బోర్డులు, రొటేటింగ్ వీల్స్, స్ప్రింగ్ బోరడ్స్, అన్నిటిని ఏర్పాటు చేయటానికి ఖమ్మం ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేయిస్తానన్నారు. అడిగిన వెంటనే చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయుటకు ఆమోదం తెలిపిన సందర్భంగా క్రీడా ప్రాంగణమునకు వచ్చేటటువంటి చిన్నపిల్లల తల్లిదండ్రులు వాకర్స్  హర్షం వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా  యువజన క్రీడల శాఖ అధికారి తుంబూరు సునీల్ రెడ్డి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ పసుపులేటి వీర రాఘవయ్య, షటిల్ కోచ్ తల్లపు రెడ్డి గౌతమ్ రెడ్డి, కబడ్డీ కోచ్ జి శ్రీనివాస్, అథ్లెటిక్స్ ట్రైనర్ నల్లగట్ల నాగబాబు, కల్లూరు ఉపాధ్యాయులు వేముల శ్రీనివాస్, తిరుమల పొంగ శ్రీనివాసరెడ్డి,కోడిసే విజయ్ కుమార్, కల్లూరు మండల గేమ్స్ కమిటీ మెంబర్స్ సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.