19-05-2025 12:48:22 AM
పాయం సత్యనారాయణ పిలుపు
భద్రాచలం, మే 18 (విజయ క్రాంతి); ఈనెల 31న తలపెట్టిన భద్రాచలం ఐటిడిఏ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాల గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పాయం సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాచలంలో గొల్లగుట్ట రోడ్ లో గోం డ్వాన సంక్షేమ పరిషత్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడు తూ స్వాతంత్రం సిద్ధించి 76 ఏళ్ళు గడిచినా షెడ్యూల్ ఏరియా ముఖచిత్రంలో అభివృద్ధి, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల అమలు వెనుకబాటుతనానికి గురవుతుందన్నారు. ఇది యావత్తు భారతదేశంలో గాని ,రాష్ట్రంలో గాని జగమెరిగిన సత్యం అని నిరూపణ అవుతున్నదన్నారు.
భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల మంజూరు చేయాలని గత కొంత కాలం నుండి గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలం కేంద్రం ఉద్యమాలు చేస్తున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏమాత్రం ఆదివాసుల ఉద్యమాలను పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు.
5వ షెడ్యూల్ ఏరియాలలో గతంలో జీవో నెంబర్ 3 అనుగుణంగా 100% రిజర్వేషన్ అమలులో ఉండి స్థానిక నిరుద్యోగ ఆదివాసీలకు 29 శాఖలో నిరుద్యోగ ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని. ఆ జీవోని కొంతమంది గిరిజనేతరులు జీర్ణించు కోలేక సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్టివేయడానికి ప్రధాన భూమిక పోషించారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన. దగ్గర్నుండి షెడ్యూల్ ఏరియాలో ఏ ప్ర భుత్వం అధికారంలో ఉన్నప్పటికీ షెడ్యూల్ ఏరియా చట్టాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఐటిడిఎ పరిధిలో గల స్పెషల్ డిఎస్సి ని భారత పార్లమెంటు రూపొందించిన (పేషా) చట్టాన్ని,షెడ్యూల్ ఏరియాలలో పటిష్టంగా అమలు చేయకుండా.
రాజకీయ పలుకుబడితో ఆ చట్టన్ని తుంగలో తొక్కి మైదాన ప్రాంత రిజర్వేషన్లు తీసుకురావడం వల్ల ఏజెన్సీ ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుందని దీనిలో భాగంగానే జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాల నే డిమాండ్తో ఈనెల 31 భద్రాచలం ఐటీడీఏ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యలగల చందర్రావు, పూనెం వరప్రసాద్, శరెం సుధాకర్, శరెం రవీంద్ర, పాలెం నాగరాజు పాల్గొన్నారు .