calender_icon.png 26 May, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి పాప్‌కార్న్ ధరలే కారణం!

24-05-2025 12:00:00 AM

నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. నిర్మాత ఎంసీ రాజు ఈ చిత్రానికి కథను అందిస్తూ నిర్మించగా, అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు. మాస్ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ.. ‘చైల్డ్ ఆర్టిస్టుగా 70 సినిమాలు చేశాను.

హీరోగా ఇది నా మొదటి చిత్రం” అన్నారు. డైరెక్టర్ అమర్ మాట్లాడుతూ.. ‘బొమ్మరిల్లు లాంటి సినిమా. ఇందులో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలుంటాయి’ అన్నారు. ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “ఘటికాచలం’ సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథలోకి వెళ్లిపోతాం. అలా ఎంగేజ్ చేస్తూనే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మిగతా చిత్రబృందం పాల్గొన్నారు. 

తెలుగు సినిమాను కాపాడుకో వాల్సిన సమయమిది: ఎస్‌కేఎన్

ఇదే వేదికపై ఎస్‌కేఎన్ ప్రస్తుత టాలీవుడ్‌లో వినిపిస్తున్న థియేటర్స్ బంద్ తోపాటు మూవీ రివ్యూస్, తెలుగు సినిమా పరిస్థితిపై స్పందిం చారు. “ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపో యింది. ఇందుకు టికెట్, పాప్‌కార్న్ ధరలు, వారమంతా ఒకే టికెట్ రేట్ ఉండటం వంటి అనేక కారణాలు న్నాయి. వీక్ డేస్‌లో ఒకలా, వీకెండ్‌లో మరోలా టికెట్ రేట్స్ పెట్టుకోవాలి. ప్రేక్షకులపై భారం వేయకుండా వీలైనంత తక్కువలో ఎలా వినోదం అం దించాలో పరిశ్రమ పెద్దలు ఆలోచిం చాలి.

ఇబ్బందుల్లో ఉన్న తెలుగు సినిమాను బతికించుకోవాలి. అమెరికాలో ఓ పది మంది ఉన్న థియేటర్‌లో ఎర్లీ మార్నింగ్ షో చూసి రివ్యూ ఇస్తారు. నిండుగా ఉన్న థియేటర్‌లో చూస్తేనే ఆ రియల్ రెస్పాన్స్ తెలుస్తుంది. రివ్యూస్‌ను ఎవరూ ఆపలేరు. ఇండస్ట్రీలో మనమూ భాగమేనని రివ్యూయర్స్ ఆలోచించాలి. సినిమాను బతికించుకునేందుకు ఒక్కటి కావాలి” అన్నారు.