24-05-2025 12:00:00 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలై సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.
తాజాగా మరో గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ‘గిచ్చమాకు.. గుచ్చమాకలా..’ అంటూ సాగుతున్న ఈ ఫోక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యంలో ధనుంజయ్ సీపాన, సౌజన్య భగవతుల పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఫోక్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన ఈ పాటలో సాయి శ్రీనివాస్, అదితి శంకర్ డాన్స్‌తో ఆకట్టుకున్నారు.
ఆనంది, దివ్య పిళ్లై ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హరి కె వేదాంతం డీవోపీ కాగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి వర్క్ చేస్తున్నారు. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు. మే 30న సినిమా థియేటర్లలోకి రానుంది.