calender_icon.png 28 May, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మాతల భేటీ నేటికి వాయిదా

24-05-2025 12:00:00 AM

జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను బంద్ విషయమై నిర్వహించ తలపెట్టిన సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ సమావేశం శనివారం జరగనుంది. తమకు గిట్టుబాటు కావడంలేదంటూ తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో మూడు రోజుల క్రితం నిర్మాతలు సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్‌లో చర్చించారు.

ఈ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయమై శుక్రవారం మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. కాగా అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం శనివారానికి వాయిదా పడినట్టు తెలుస్తోంది.