డిజైర్ సొసైటీలో ముగిసిన సమ్మర్ క్యాంప్
07-05-2024 12:32 AM
పటాన్‌చెరు, మే 6 : జిన్నారం మండలం బొల్లారంలోని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంరక్షణ కేంద్రం డిజైర్ సొసైటీలో మూడు రోజులుగా జరుగుతున్న సమ్మర్ క్యాంపు సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు మ్యాజిక్ షో, టెల్లింగ్ డాల్‌తో పాటు పలు స్కిట్స్ నిర్వహించారు. మూడు రోజులుగా జరిగిన కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమానికి బొ ల్లారం సీఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యూట్రిషన్ కిట్స్, విద్యా సామగ్రిని సీఐ అందజేశారు. 14సంవత్సరాలుగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బా రిన పడిన పిల్లలకు సమ్మర్ క్యాంప్‌ను ఏర్పా టు చేస్తున్నామని, అనాథపిల్లలకు ప్రతినెల న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తున్నామని సొసై టీ నిర్వహకుడు రవికుమార్ తెలిపారు.




