25 July, 2026 | 5:09 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేయాలి

25-07-2026 04:03 PM

నిర్మల్ జులై 25(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తక్షణమే అమలు చేసి రైతులకు పంట నష్టాల నుంచి ఆర్థిక భద్రత కల్పించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు పంట నష్టాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం దేశంలోని అత్యధిక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అమలు చేయకపోవడం వల్ల రైతులు బీమా రక్షణకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.