30-07-2025 12:12:34 AM
భువనేశ్వర్, జూలై 29: భారత రక్షణశాఖ మరో అస్త్రానికి మెరుగులు దిద్దుతోంది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ మిసైల్ పరీక్ష విజయవంతమైంది. మంగళవారం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీనిని ప్రయోగించింది. సో మ, మంగళవారాల్లో నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ ప్రళయ్ క్షిపణి అన్ని ప్రమాణాలను అందుకుంటూ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని అధికారులు వెల్లడించారు.
ఈ షార్ట్ రేంజ్ గైడెడ్ మిసైల్ 150 కిలో మీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. 350 నుంచి 700 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. శత్రువుల కమాండ్ సెంటర్లు, లాజిస్టిక్స్ హ బ్స్‌ను ఇది లక్ష్యంగా చేసుకోగలదు. వా హనాలపై ఉంచి దీన్ని ఎక్కడికంటే అక్కడికి తర లించి మోహరించవచ్చు.
ప్రళయ్ మిసైల్ పరీక్ష విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో శా స్త్రవేత్తలను అభినందించారు. ఉపరితలం నుంచి ఉపరితలం పైన లక్ష్యాన్ని ఛేదించే కొ త్త రకం క్షిపణి అని, సాయుధ బలగాలకు ఇ ది మరింత ప్రేరణాత్మక శక్తిని ఇస్తుందని డీఆర్‌డీవో చైర్మన్ జి. సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.