30-07-2025 12:14:33 AM
మావోయిస్టు మృతి
చర్ల, జూలై 29: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెం దాడు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గా యాలయ్యాయి.
అనంతరం మావోయిస్టుల పై ఎదురు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఒక మావోయిస్టు మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. గాలింపు చ ర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ నెల 2 8 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలకు పిలుపునివ్వడంతో బస్తర్‌పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.