26-01-2026 03:37:05 PM
జెండాను ఆవిష్కరించిన అదనపు ఎస్పీ మహేందర్
మెదక్,(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించి, అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు ప్రతి భారత పౌరుడికి గర్వకారణమని అన్నారు. రాజ్యాంగ విలువలు, ఆశయాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజాసేవనే పరమ ధ్యేయంగా తీసుకుని విధులను అంకితభావంతో నిర్వహించాలని సూచించారు.
ప్రతి బాధితుడికి న్యాయం అందించినప్పుడే రాజ్యాంగానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని సంపాదించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో డియస్పి లు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, రంగా నాయక్, సీఐలు, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, మహేష్, జర్జ్, శైలందర్, రాజశేఖర్ రెడ్డి, ఎసై లు సిబ్బంది పాల్గొన్నారు.