calender_icon.png 26 May, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీశ్రేణులతో కలిసి మన్‌కి బాత్ వీక్షించిన ప్రవీణ్ రావు

26-05-2025 01:12:22 AM

కరీంనగర్, మే 25 (విజయక్రాంతి): క రీంనగర్ పట్టణం విద్యానగర్ 39 వ డివిజన్ బిజెపి శ్రేణులతో కలిసి పార్లమెంటు కన్వీనర్  బోయినపల్లి ప్రవీణ్ రావు ఆదివారం ప్రసారమైన ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్ కి బాత్ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని, అప్పటినుండి ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమవుతుందన్నారు.

ముఖ్యంగా ఆ నెల లో జరిగిన అంశాలు వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రజలతో పంచుకుంటారని తెలిపారు.  ఈ కార్యక్రమాన్ని ప్రతినెల 23 జా తీయ భాషలు, 31  మాండలీకాలు అన్ని కేం ద్రాల ద్వారా ఆకాశవాణి ప్రసారం చేస్తుందన్నారు. అలాగే ఇంగ్లీష్ సహా 11 అంత ర్జాతీయ భాషల్లోనూఇదిప్రసారమవుతుందన్నారు .

సామాన్యులతో  అనుసంధానానికి  ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఈ ప్రోగ్రాం  ప్రధాని మోదీ ని ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గుండారపు సంపత్, పాలజి ప్రదీప్, న్యాత ప్రవీణ్, లక్ష్మణ్, అశోక్, చైతన్య అభి, రాంచరణ్, బన్నీ, తదితరులుపాల్గొన్నారు.