17 April, 2026 | 12:24 PM

సంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రావీణ్య

14-06-2025 12:48 AM

సంగారెడ్డి, జూన్ 13(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఐబి గెస్ట్ హౌస్ కి నూతన కలెక్టర్  పి.ప్రావీణ్య చేరుకోగానే అదనపు కలెక్టర్ చంద్రశేఖర్,  ఆర్డీవో రవీంధర్ రెడ్డి మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో  నూతన జిల్లా కలెక్టర్ గా  ఆమె బాధ్యతలు స్వీకరించారు. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన పి.ప్రావీణ్య గతంలో హనుమకొండ జిల్లా కలెక్టర్గా, అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్గా అనేక పరిపాలనాత్మక బాధ్యతలునిర్వహించారు.