27-07-2025 01:22:20 AM
ఈ విద్యాసంవత్సరంలో మొత్తం వెయ్యి స్కూళ్లకు అనుమతి
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో 790 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేర కు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులుజారీ చేసింది. తొలివిడతలో ఇప్పటికే గత నెలలో 210 ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తాజాగా మరో 790తో మొత్తం వెయ్యి పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ ఏడాదిలో చేరే విద్యార్థి వచ్చే ఏడాది ఒకటో తరగతిలో ఉండేలా అడ్మిషన్లు కల్పిస్తారు. అంటే ఈ సంవత్సరం యూకేజీలో అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ప్రస్తుత పాఠశాలల్లో ఈ తరగతులు నిర్వహించేందుకు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను, మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా అధికారులకు జారీ చేశారు.
పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సైంత అందించాలని సూచించారు. ఒక ప్రీప్రైమరీ సెక్షన్‌కు ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆయాను నియమించనున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్ లేదా ప్రైమరీ టీచింగ్‌లో అనుభవం, ఆయాకు ఏడో తరగతి అర్హతగా నిర్ణయించారు. 18 సంవత్సరాల నుంచి 44 సం. వరకు ఉండాలని తెలిపారు.