27-07-2025 12:52:57 AM
ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): టీచర్లకు పదోన్నతులు దక్క నున్నాయి. టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి రెండు ఫైల్స్ ఉన్న ప్పటికీ, సీఎం ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సీఎం సంతకం తర్వా త ఆ ప్రమోషన్ల ఫైల్ విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయానికి చేరినట్లు తెలి సింది. అయితే బదిలీలు లేకుండా ప్రమోషన్లు ఇచ్చేందుకే ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకట్రెండు రోజుల్లో ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేయ నుంది. ఇప్పటికే ప్రమోషన్లకు సం బంధించి 2025 జూన్ 30 నాటికి ఉన్న అన్ని ఖాళీలను సేకరించిన ప్రభుత్వం.. అన్ని కేటగిరిల వారికి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ సోమవారం లేదా ఆ తర్వాత విడుదల కానుంది. ఏడాదిగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కు ఎట్టకేలకు అనుమతి లభించింది.
ఈ ప్రక్రియ వల్ల దాదాపు 2500 మంది టీచర్లకు పదోన్నతులు దక్కే అవకాశముంది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో ప్రమోషన్లు చేపట్టనున్నారు. దీంతో కొత్తగా మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు మాత్రం బదిలీలు, ప్రమోషన్లు ఒకేసారి చేపట్టాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.