calender_icon.png 11 October, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

11-10-2025 01:26:21 AM

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, అక్టోబర్ 10(విజయక్రాంతి): వర్షాల కారణంగా ఆస్తి,ప్రాణం నష్టం జరగకుండా అప్రమత్తంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని,వర్షాకాలంలో సీజనల్  వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను, తహసిల్దార్లు,మెడికల్ ఆఫీసర్ లను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి. ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మిని సమావేశ మందిరం నుండి ఎబేక్స్ ద్వారా తహసీల్దారులు,

ఎంపీడీవోలతో ఏర్పాటుచేసిన వెబ్‌ఎక్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయని, కాజ్వేలు, చెరువులు, కుంటలు, రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో నీరు ప్రవహిస్తున్న చోట అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని, అక్కడ వాచర్లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించుకుంటూ ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చూడాలని కలెక్టర్ అన్నారు.

నీళ్లు ప్రవహిస్తున్న చోట ఎర్రని వస్త్రాన్ని అడ్డంగా కట్టాలని మరియు నీళ్లు పాడుతున్నప్పుడు వెళ్ళొద్దని పెద్ద బ్యానర్లను రెండు వైపులా ఏర్పాటు చేయాలని, మండలాధికారులు రాపిడ్ రెస్క్యూ టీం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లోని పంచాయతీ సెక్రటరీలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి వివరాలను అడిగి తెలుసుకోవాలని, వెదర్ ఫోర్ కాస్ట్ అప్డేట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మండల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

మండలాల్లో గ్రామాలలో చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని, కాలువలు శుభ్రపరచాలని, నీళ్లు నిలవకుండా చూడాలని, షాకింగ్ యంత్రాలను వాడాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు. జ్వరాలు డెంగ్యూ మలేరియా వంటి కేసులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, మంచినీరు సరఫరా చేయాలని, పరిశుభ్రతపై ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాలని మండలాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా పరిషత్ సీఈవో వెంకటరెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ పద్మజ, డిపిఓ పార్థసారథి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.