calender_icon.png 11 October, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్

11-10-2025 01:27:32 AM

చిన్న చింతకుంట, అక్టోబర్ 10 : మండలంలోని వడ్డేమాన్ ప్రభుత్వ జడ్పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మాక్ పోలింగ్ కార్యక్రమం లో విద్యార్థులే ఓటర్లుగా, పోటీ చేసే అభ్యర్థులుగా, పోలింగ్ అధికారులుగా, ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారులుగా, ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తూ ఎన్నికల విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మురళి కృష్ణ హాజరై మాట్లాడుతూ ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకొని భవిష్యత్తులో బాధ్యత గల పౌరులుగా మారెందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జి హెచ్ ఎం మోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందంపాల్గొన్నారు.