08-05-2025 12:34:35 AM
గోపాలపేట మే7: గోపాలపేట గ్రామాన్ని పైలె ట్ మండలం గా గుర్తించిన సందర్భంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు లకు బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం (ఆర్.ఒ.ఆర్ యాక్టు)2025 లో భాగంగా వనపర్తి జిల్లాలోని గోపాల్పేట మండలాన్ని పైలెట్ మండలంగా గుర్తించడం జరిగిందన్నారు.
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ అధికారులు స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజల నుండి భూ ఫి ర్యాదులను స్వీకరిస్తుంది చెప్పారు. ఇందులో భాగంగా గోపాల్పేట మండలంలోని జిల్లా కలెక్టర్ పోల్కే పహాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పరిశీలించారు. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి చాలా బాగుందన్నారు.
ప్రజలు తమ సమస్యలు తీసుకొని రెవెన్యూ సదస్సుకు వచ్చిన వారికి నిర్ణిత ప్రొఫార్మలో పూరించి ఇచ్చే విధంగా ఇద్దరు రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది దరఖాస్తులోని సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామానికి చెందిన రెవెన్యూ రికార్డులు పాత ఆర్. ఒ . ఆర్ రిజిస్టరు, పహాని రికార్డులు, చేసాల వంటి రికార్డులతో పాటు ప్రస్తుతం ఆన్లైన్ ఉన్న భూ రికార్డులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ పరిష్కారానికి చర్యల తీసుకుంటున్నారు.
ఎన్నో సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు భూ భారతి రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కారం అవుతుందని రైతులు ఎంతో నమ్మకంతో సదస్సుకు వస్తున్నారు. సమస్య ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శసురభిసూచించారు. భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ శాఖను సద్వినియోగం చేసుకునే వి ధంగా గ్రామాల్లో ప్రజలను అవగాహన కల్పించాలని సూచించారు. ఈ రోజు మండలంలోని పోల్కే పహాడ్ గ్రామంలో 44 దరఖాస్తులు, చాకలిపల్లి గ్రామం నుండి 29 వెరసి ఈ రోజు 73 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమం లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రాజు, డిటి తిలక్ రెడ్డి ఇతర రెవెన్యూ సిబ్బంది రైతులు తదితరులు ఉన్నారు.