27 July, 2026 | 1:02 AM

క్వార్టర్ ఫైనల్లో ప్రీతి పవార్

27-07-2026 12:00 AM

గ్లాస్గో, జూలై  26: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో దూసుకెళుతున్నారు. తాజాగా మహిళల 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రీ క్వార్టర్స్‌లో ఆమె మలావికి చెందిన దేబ్రో మెంజెపై విజయం సాధించింది.

ఈ బౌట్ తొలి రౌండ్‌లోనే ప్రీతి పంచ్‌లతో విరుచుకుపడింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ఆధిక్యంలో నిలిచింది. రెండో రౌండ్‌లో సైతం ప్రీతి జోరుకు ప్రత్యర్థి బాక్సర్ నిలవలేకపోయింది. ఏ దశలో పోటీ ఇవ్వలేకపోవడంతో ప్రీతి ఏకపక్ష విజయాన్ని అందుకుంది. 2022 ఆసియాక్రీడల్లో కాంస్యం సాధించిన ఆమె పారిస్ ఒలింపిక్స్‌లో అనారోగ్యం బారిన పడినా ప్రీ క్వార్టర్స్ వరకూ చేరుకుంది.  ఇప్పుడు కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగింది.