15 May, 2026 | 8:36 PM

Breaking News

యువతి యువకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!   •   అక్రమ ఇసుక లారీ పట్టివేత   •   వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు   •   డివైడర్ పై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు   •   తెలంగాణ మోడల్ స్కూల్‌లో పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం   •   బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి   •   సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •  

ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం

23-04-2024 01:32 AM

జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): వర్షపునీటిని ఒడిసి పట్టేందుకు జలమండలి ప్రాధాన్యమిస్తుందని, దీనిలో భాగంగా ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్లంబర్స్, తాపీమేస్త్రీలకు మూడురోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని జల మండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో జలమండలి నిర్మించిన రెయిన్ వాటర్ హర్వెస్టింగ్ థీమ్ పార్క్‌ను ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు. థీమ్ పార్కులో వాననీటిని ఒడిసి పడుతున్న పద్ధతులను వివరించారు.

శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 86396 19366 అనే నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, రెవెన్యూ విభాగ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, జీఎం రాజేందర్, ఇంకుడు గుంతల నిర్మాణ ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ, రిసోర్స్ పర్సన్ కల్పన పాల్గొన్నారు.