21-09-2025 06:25:22 PM
మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బిజెపి నాయకుల ముందస్తు అక్రమ అరెస్ట్..
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పెంబల జానయ్య..
మునుగోడు (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇష్టానుసారంగా అలైన్మెంట్ మారుస్తూ రైతుల పొట్ట కొడుతుందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు పెంబల జానయ్య కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ చుట్టుపక్కల త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా బిజెపి పార్టీ మద్దతు ఇస్తూ హైదరాబాద్ కు వెళ్తున్న మునుగోడు మండల బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు పంట భూములను కోల్పోతున్న పరిస్థితి నెలకొందని.. పచ్చటి పొలాల గుండా అలైన్‌మెంట్ చేసి, రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ తో రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆటలు పేద రైతులకు శాపంలా మారాయన్నారు. అరెస్ట్ అయిన వారిలో నరేందర్ గౌడ్, కర్నాటి లింగయ్య, నీరుడు రాజారాం, అక్కెనపల్లి సతీష్, పందుల యాదయ్య, ఒడిగ స్వామి, పెరుమాల శ్రీరామ్, పోలే వెంకటేశ్వర్లు, గోలి నాగేందర్, సందీప్, కడారి నరసింహ ఉన్నారు.