21-09-2025 06:55:56 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తంగళ్ళపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పద్మశాలి సంఘం కుల బాంధవులు నాయకులు పాల్గొనడం జరిగింది. పద్మశాలి సంఘం కుల బంధువులు నాయకులు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన నిస్వార్థ సేవకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన తెలంగాణ బాపూజీ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి కుల బాంధవులు ఈ సందర్భంగా తెలియజేశారు.