21-09-2025 06:59:29 PM
పద్మశాలి సంఘం నేత న్యాయవాది సిద్ధి రాములు..
కామారెడ్డి (విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు ఆదర్శనీయమని పద్మశాలి సంఘం నేత, న్యాయవాది క్యాతం సిద్ధిరాములు అన్నారు. ఆదివారం కొత్త బస్టాండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు చాట్ల రాజేశ్వర్, సిరి గాద లక్ష్మీ నరసింహులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సిరిగాద శంకర్, ధర్మపురి, న్యాయవాది నాగభూషణం, రాజయ్య, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.