21-09-2025 06:52:57 PM
కొండపాక: అందరూ పూలతో దైవాన్ని పూజిస్తే, పూలనే దైవంగా పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణది. అలాంటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ పెద్దరామాస ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజులు ఆడపడుచులు అందరూ కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ. దేశంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి ఎంగిలిపూల బతుకమ్మ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆడపడుచులు కలిసి తొమ్మిది రోజులపాటు సంతోషంగా ఘనంగా, సంబరంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ ఉమ్మడి కొండపాక మండల వ్యాప్తంగా మొదటి రోజు ఘనంగా నిర్వహించారు.