21-09-2025 06:34:11 PM
మందమర్రి (విజయక్రాంతి): బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్లను మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు(Commissioner Thungapindi Rajalingu) పరిశీలించారు. ఆదివారం పట్టణంలోని పాత బస్టాండ్, మార్కెట్, శ్రీపతి నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్లను మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఘాట్లలో నీటి మట్టం, పారిశుద్ధ్యం, లైటింగ్ నిర్వహణ తదితర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, పండుగను సురక్షితంగా, జరుపుకోవడంలో మున్సిపాలిటీ పూర్తి బాధ్యత తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం గోపికృష్ణ మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.