21-09-2025 06:49:10 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని ఖిలానగర్ కు చెందిన మైనార్టీ యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ సాజిద్ ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తనయుడు కుంభం శ్రీరామ్ రెడ్డి ఆదివారం సాజిద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.