21-09-2025 06:31:34 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): మెట్ పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, ఆడెపు రమణ, గాజా రాజారెడ్డి, జాకీర్, ముకిం మహేందర్, తాండ్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.