calender_icon.png 21 September, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పిఎస్ఆర్ జన్మదిన వేడుకలు

21-09-2025 06:47:23 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) 66వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఐబీ విశ్రాంత భవన్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ సేవలందిస్తున్నారని కొనియాడారు. అన్ని వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ తోనే సాధ్యమని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమమే ఇందుకు నిదర్శనమన్నారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. ఎమ్మెల్యే ఆరోగ్యంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఆరీఫ్, మండలాధ్యక్షులు రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు,నాయకులు రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్, కంది మోహన్, గుత్తికొండ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.