21-09-2025 06:38:10 PM
బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం..
దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్(BRS Party President Ramavath Ravindra Kumar) అన్నారు. ఆదివారం నేరడుగొమ్ము మండలం ధర్మారేఖ్య తండాకు చెందిన 100 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ 22 నెలల పాలనలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికలలో సత్తాచాటాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ఆయన గుర్తు చేశారు. రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉందని తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తెచ్చిందని ఆయన తెలిపారు. రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిషేక్ నాయక్,మాజీ సర్పంచ్ చెన్న నాయక్, బషీర్,తదితరులు ఉన్నారు.