కేక్ పౌడర్‌తో గుడుంబా తయారీ
నల్లబెల్లం, పటిక స్థానంలో కొత్త పదార్థాలు
గోదావరి మీదుగా పొరుగు రాష్ట్రాలకు తరలింపు
నెలకు పదుల సంఖ్యలో కేసులు నమోదు
అయినా.. పద్ధతి మార్చుకోని తయారీదారులు
జయశంకర్ భూపాలపల్లి, మే12 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పల్లెల్లో గుడుంబా గుప్పుమంటోంది. ఎక్సైజ్‌శాఖ అధికారులు నల్లబెల్లం, స్పటికపై ఆంక్షలు పెట్టడంతో తయారీదారులు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. తయారీలో కేక్ పౌడర్, చక్కెర వినియోగిస్తున్నారు. తయారీదారులు ఒకప్పుడు నల్ల బెల్లం, పటికను వినియోగించేవారు. మార్కెట్‌లో కిలో చక్కెర రూ.38, కిలో కేక్ పౌడర్ రూ.230కే లభిస్తుండటంతో తయారీదారులు సులభంగా గుడుంబా తయారీ చేస్తున్నారు. జిల్లాలోని కాటారం, మహదేవ్‌పూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల, భూపాలపల్లి రూరల్ మండలం, చిట్యాల, గోరికొత్తపల్లి, రేగొండ, టేకుమట్ల ప్రాంతాల్లో గుడుంబా తయారీ ఎక్కువగా ఉందని, తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా పల్లెలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారని సమాచారం.
రవాణాకు బైక్‌లు, ఆటోలను వినియోగిస్తే, దొడ్డిదారుల్లో సరు కు తరలిస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతాల్లో తయారీ స్థావరాలు ఎక్కువగా ఉంటున్నాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కొందరు తయారీదారులు గోదావరి మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలకూ తరలిస్తున్నారని చెప్తున్నారు.
దాడులు చేసినా..
మద్యం ధరలు పెరగడం, గ్రామాల్లో పేదిరకాన్ని ఆసరా చేసుకుని తయారీదారులు గుడుంబా తయారు చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తు న్నారు. ఎక్సైజ్, పోలీసుశాఖలు జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్థావరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా, తయారీదారులు మాత్రం గుడుంబా విక్రయాలు ఆప డం లేదు. ఎలక్షన్ నేపథ్యంలో ఇటీవల వేలా ది లీటర్ల చక్కెర పానకం, వందలాది లీటర్ల గుడుంబా పట్టుబడింది. గుడుంబా తయారీపై ప్రతి నెలా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలిసీ తెలియక కొంద రు, పాత నిందితులు కొందరు ఇలా కటకటాలపాలవుతున్నారు. కుటుంబ పెద్దలు జైలు పాలవుతుండడంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నది.
అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం..
కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాముత్తారం, కాటారం, మల్హర్, పలిమెల, మహాదేవ్‌పూర్ మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాం. గుడుండా బట్టీలపై దాడు లు చేస్తున్నాం. నెల నెలా పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటికే నల్లబెల్లం, పటిక రవాణాను కట్టడి చేశాం. దీంతో తయారీదారులు చక్కెరతోపాటు ఇతర సరుకులను వినియో గించి గుడుంబా తయారు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా చక్కెర సీజ్ చేశాం. తయారీదారులపై అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేస్తాం.
నరేందర్‌రెడ్డి
ఎక్సైజ్‌శాఖ సీఐ, కాటారం




